: రాజ్ నాథ్ సింగ్ కు గుండె సమస్య... హుటాహుటిన ఆసుపత్రికి తరలింపు
కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కు గుండెల్లో సమస్య తలెత్తడంతో, ఆయనను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఈ ఉదయం ఆయనకు స్వల్పంగా గుండె నొప్పి రావడంతో, 9:15 గంటల సమయంలో మెడిసిటి మేదాంతా హాస్పిటల్ లో ఆయనను చేర్చారు. ప్రస్తుతం రాజ్ నాథ్ ను ఐసీయూలో వుంచి చికిత్సను అందిస్తున్నామని వెల్లడించిన ఆసుపత్రి వర్గాలు, ఆయన ఆరోగ్య పరిస్థితిపై వ్యాఖ్యానించేందుకు నిరాకరించాయి. ప్రముఖ హృద్రోగ నిపుణుడు ఆర్ఆర్ కష్విని నేతృత్వంలోని డాక్టర్ల బృందం ఆయనకు చికిత్స చేస్తున్నట్టు తెలుస్తోంది. మరికాసేపట్లో రాజ్ నాథ్ ఆరోగ్యంపై బులెటిన్ విడుదల కావచ్చని సమాచారం.