: సైబర్ టవర్స్ కు బాంబు బెదిరింపు... సోదాలు చేస్తున్న హైదరాబాదు పోలీసులు
హైదరాబాదులోని హైటెక్ సిటీలో కొద్దిసేపటి క్రితం కలకలం రేగింది. హైటెక్ సిటీలోని సైబర్ టవర్స్ కు బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో అక్కడి సాఫ్ట్ వేర్ కంపెనీల్లో పనిచేస్తున్న ఉద్యోగులు ఉరుకులు పరుగులు పెట్టారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు. బాంబ్ స్క్వాడ్ తో సైబర్ టవర్స్ లోని అణువణువునూ పరిశీలిస్తున్నారు. ముందస్తు జాగ్రత్త చర్యగా సైబర్ టవర్స్ లోని ఉద్యోగులను బయటకు పంపిన పోలీసులు అన్ని కార్యాలయాల్లో ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు.