: కలలో కూడా ఊహించలేని ఘటనలు జరిగాయి: డీకే అరుణ
నేడు అసెంబ్లీలో ఏం జరిగిందన్న విషయాన్ని కేసీఆర్ సర్కారు బయటకు చెప్పకుండా, తమకు కావాల్సిన సమాచారాన్ని మాత్రమే విడుదల చేసి ప్రజలను తప్పుదారి పట్టిస్తోందని మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ నేత డీకే అరుణ దుయ్యబట్టారు. అసెంబ్లీలో ఇటువంటి ఘటనలు జరుగుతాయని తాను కలలో కూడా ఊహించలేదని ఆమె అన్నారు. సభలో జరిగిన ఘటనలకు సంబంధించిన దృశ్యాలను బయటకు విడుదల చేయాలని ఆమె డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల సమస్యల పరిష్కారం దిశగా ఎటువంటి ఆలోచనలూ చేయడం లేదని విమర్శించారు. ఆ పార్టీ నేతలు బెదిరింపులకు దిగుతున్నారని ఆరోపించారు. కేసీఆర్ పూటకో రకంగా మాట్లాడుతున్నారని, ఆయన తన వైఖరిని మార్చుకుని, ప్రజల ఆకాంక్షల కోసం పనిచేయాలని అరుణ హితవు పలికారు.