: కొత్త పార్టీ పెడతా... అసెంబ్లీకి హాజరుకాను: కోమటిరెడ్డి


టీకాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ అధిష్ఠానం టీపీసీసీ అధ్యక్షుడిగా ఉత్తమ్ కుమార్ రెడ్డిని నియమించడంపై ఆయన మండిపడుతున్నారు. ఉత్తమ్ నాయకత్వాన్ని తాను పూర్తిగా వ్యతిరేకిస్తున్నానని స్పష్టం చేశారు. దీన్ని నిరసిస్తూ, అసెంబ్లీ సమావేశాలను తాను బహిష్కరిస్తున్నానని... సమావేశాలకు కూడా హాజరుకానని చెప్పారు. అవసరమైతే కొత్త పార్టీని పెడతానని స్పష్టం చేశారు. మంత్రి పదవినే వదులుకున్న ఘనత తనదని చెప్పుకొచ్చారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద టీడీపీ నేత రేవంత్ రెడ్డితో కలసి మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్టు సమాచారం. ప్రస్తుతం కోమటిరెడ్డి వ్యాఖ్యలు ప్రకంపనలు పుట్టిస్తున్నాయి.

  • Loading...

More Telugu News