: సఫారీలతో మ్యాచ్ లో రాణిస్తున్న పాక్ బ్యాట్స్ మెన్... 25 ఓవర్లలో 126/2
వరల్డ్ కప్ మెగా టోర్నీలో భాగంగా దాయాది పాకిస్థాన్ జట్టు, దక్షిణాఫ్రికాతో మ్యాచ్ లో భారీ స్కోరు దిశగా సాగుతోంది. నేటి ఉదయం ప్రారంభమైన మ్యాచ్ లో 25 ఓవర్లు ముగిసేసరికి 126 పరుగులు చేసిన పాక్, రెండు కీలక వికెట్లు కోల్పోయింది. నిన్నటిదాకా పేలవ ఫామ్ తో సతాయించిన పాక్ కీలక బ్యాట్స్ మన్ యూనిస్ ఖాన్(35) నేటి మ్యాచ్ లో గాడినపడ్డాడు. టాస్ గెలిచి పీల్డింగ్ ఎంచుకున్న సఫారీలు, పాక్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించారు. ఇప్పటికే ఓపెనర్ల వికెట్లను కోల్పోయిన పాకిస్థాన్ నిలకడగానే పరుగులు రాబడుతోంది. రెండో ఎండ్ లో మిస్బావుల్ హాక్ (15) బ్యాటింగ్ చేస్తున్నాడు.