: హైదరాబాదు యువతికి విశాఖలో నరకం చూపారు!... మరో నిర్భయ కేసు?
'నిర్భయ' ఉదంతం దేశంలో ఎంత కలకలం రేపిందో ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు! ఆ ఘటన తర్వాత కూడా అనేక దారుణ అత్యాచార ఉదంతాలు చోటచేసుకున్నాయి. తాజాగా, హైదరాబాదు నుంచి వచ్చిన ఓ యువతిపై విశాఖపట్నంలోని పెందుర్తిలో సామూహిక అత్యాచారం జరిగింది. ఓ పెళ్లికి వచ్చిన అమ్మాయిని నలుగురు వ్యక్తులు బలవంతంగా ఓ వాహనంలో ఎక్కించుకుని రాత్రంతా తిప్పుతూ అత్యాచారం చేశారు. అనంతరం, ఆమెను రోడ్డుపై వదిలేసి పరారయ్యారు. స్థానికులకు ఆమె విషయాన్ని వివరించగా, వారు ఓ వ్యక్తిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. అతడు తనకేమీ తెలియదని, ఆమె బాగా తాగి ఉందని, తాను ఆమెకు సాయం చేశానని అంటున్నాడు. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.