: 20 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన టీమిండియా


టీమిండియా 20 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. 183 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలో దిగిన భారత జట్టు ఆదిలోనే శిఖర్ ధావన్ (9) వికెట్ కోల్పోయింది. అనంతరం, 20 పరుగుల వద్ద రోహిత్ శర్మ (7) ను టేలర్ అవుట్ చేశాడు. ఈ రెండు వికెట్లు టేలర్ ఖాతాలో చేరడం విశేషం. కట్టుదిట్టమైన బౌలింగ్ తో టేలర్, హోల్డర్ టీమిండియా బ్యాట్స్ మెన్ ను ఇబ్బంది పెడుతున్నారు. కాగా, క్రీజులో విరాట్ కోహ్లీకి జతగా రహానే ఉన్నాడు. పది ఓవర్లకు భారత జట్టు రెండు వికెట్లు నష్టపోయి 41 పరుగులు చేసింది.

  • Loading...

More Telugu News