: రాజధాని ప్రాంతంలో ఎవరైనా పర్యటించవచ్చు... రెచ్చగొట్టే విమర్శలే చేయొద్దు: మంత్రి నారాయణ


నవ్యాంధ్ర రాజధాని ప్రాంతంలో ఎవరైనా పర్యటించవచ్చని ఏపీ మంత్రి నారాయణ అన్నారు. అయితే, అక్కడివారిని రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేయవద్దని సూచించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేకున్నా రైతులకు మంచి ప్యాకేజీ ఇచ్చామని, సంతోషంగా ఉన్నామని రైతులంతా చెప్పారన్నారు. 2018 జూన్ నాటికి రాజధాని నిర్మాణం తొలి దశ పూర్తవుతుందని చెప్పిన మంత్రి, 20 ఏళ్లలో రాజధాని నిర్మాణం పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. రాజధాని కోసం భూసేకరణ దాదాపు పూర్తయిందన్న మంత్రి, ఇంకా 700 ఎకరాలు సేకరించాల్సి ఉందని వెల్లడించారు.

  • Loading...

More Telugu News