: ప్రత్యేక హోదాపై బీజేపీ ఇంకా మాట నిలబెట్టుకోలేదు: పవన్ కల్యాణ్
ఏపీకి ప్రత్యేక హోదాపై బీజేపీ ఇంకా మాట నిలబెట్టుకోలేదని నటుడు పవన్ కల్యాణ్ అన్నారు. మాట ఇచ్చేముందు ఇతర రాష్ట్రాలు ప్రత్యేక హోదా కోరతాయని బీజేపీకి తెలియదా? అని ప్రశ్నించారు. మాట తప్పితే బీజేపీని ఏపీలో ఎవరు విశ్వసిస్తారన్నారు. తెలంగాణకోసం అన్ని పార్టీలు కలసి పోరాడినట్టే, ఏపీకి ప్రత్యేక హోదా కోసం కూడా ఎంపీలందరూ పార్టీలకతీతంగా పోరాడాలని కోరారు. ఈ విషయంపై తాను కూడా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తానని చెప్పారు. అనుభవం కోసం ఎలాంటి ఎన్నికలొచ్చినా పోటీ చేయాలని అనుకుంటున్నామని, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీచేసే అంశంపై ఇంకా ఆలోచించలేదని పేర్కొన్నారు.