: మరో పాకిస్థాన్ మహిళకు అత్యున్నత అంతర్జాతీయ అవార్డు


గతేడాది పాకిస్థాన్ కు చెందిన సాహస బాలిక మలాలా యూసుఫ్ జాయ్ కు అత్యున్నతమైన నోబెల్ శాంతి పురస్కారం దక్కిన సంగతి తెలిసిందే. తాజాగా పాక్ కు చెందిన మరో మహిళకు అత్యున్నత అవార్డు దక్కింది. మహిళల హక్కుల కోసం తన దేశంలోనే కాకుండా, అంతర్జాతీయంగా నిత్యం పోరాడుతున్న తబుస్సమ్ అద్నాన్ అనే మహిళ... 2015 ఏడాదికి గాను అమెరికాకు చెందిన 'అంతర్జాతీయ సాహస మహిళ' అవార్డుకు ఎంపికైంది. 13ఏళ్లకే వివాహం చేసుకున్న తబుస్సమ్, అత్తగారి ఇంట ఎన్నో బాధలు అనుభవించారు. నరకయాతన అనుభవించిన ఆమె చివరకు తన 20వ ఏట భర్తకు విడాకులిచ్చి... ఓ స్వచ్ఛంద సంస్థను స్థాపించి, బాలికల విద్య, వరకట్నం, పరువు హత్యలు వంటి అనేక సామాజిక అంశాలపై పోరాటం చేస్తున్నారు.

  • Loading...

More Telugu News