: కోహ్లీ... జాగ్రత్తగా మసలుకో!: టీమిండియా వైస్ కెప్టెన్ కు బీసీసీఐ వార్నింగ్


స్పోర్ట్స్ జర్నలిస్ట్ పై నోరు పారేసుకున్న టీమిండియా వైస్ కెప్టెన్ విరాట్ కోహ్లీకి బీసీసీఐ వార్నింగిచ్చింది. జట్టు పరువు, ప్రతిష్ఠలు పెంచే విధంగా నడచుకోవాలని, భవిష్యత్తులో ఈ తరహా ఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్తగా మసలుకోవాలని సూచించింది. ఈ మేరకు విడుదల చేసిన ప్రకటనలో బీసీసీఐ కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. అయితే ఈ వివాదంలో కోహ్లీని వెనకేసుకొచ్చిన టీమిండియా మేనేజ్ మెంట్ కు కూడా బీసీసీఐ వార్నింగిచ్చింది. అనవసర రాద్ధాంతం మాని మెగాటోర్నీపై దృష్టి సారించాలని కాస్త గట్టిగానే మందలించింది.

  • Loading...

More Telugu News