: ఆ స్కూలును చూసి ఆశ్చర్యపోయిన మంత్రి


ఓ పాఠశాలకు ఆకస్మిక తనిఖీకి వెళ్లిన మంత్రి అక్కడ అంతా సెలవులో ఉండడం చూసి ఆశ్చర్యపోయిన ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. నాగ్ పూర్ సమీపంలోని ఓ పాఠశాలకు ఆ రాష్ట్ర సామాజిక న్యాయ శాఖ మంత్రి రాజ్ కుమార్ బదోలే వెళ్లారు. వెళ్లి పాఠశాలను చూస్తే తలుపులు మూసి ఉన్నాయి. విషయం ఏంటని ఆరాతీసిన మంత్రి, పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు అంతా సెలవులో ఉన్నారని తెలిసి ఆశ్చర్యపోయారు. ఈ పాఠశాలలో మొత్తం 80 మంది ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థులు ఉండగా, వారి కోసం 25 మంది ఉపాధ్యాయులు విధులు నిర్వహిస్తున్నారు.

  • Loading...

More Telugu News