: పెళ్లి తరువాత ఇంటి పేరు మార్చుకోవాలా?


వివాహం తరువాత వధువు ఇంటి పేరు మారుతుంది. ఈ విధానం మహిళలకు నచ్చడం లేదట. షాదీ.కామ్ చేసిన సర్వేలో వివాహ బంధంపై ఇలాంటి ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి. సుమారు 40 శాతం మంది మహిళలు వివాహం తరువాత తమ ఇంటి పేరు మారడాన్ని వ్యతిరేకించినట్టు సర్వే తెలిపింది. దేశ వ్యాప్తంగా 24 నుంచి 30 ఏళ్ల మధ్య వయసున్న 11,200 మంది మహిళలపై ఈ సర్వే నిర్వహించగా, 40.4 శాతం మంది ఇంటి పేరు మార్పుపై అభ్యంతరం వ్యక్తం చేశారట. 27 శాతం మంది వివాహం తరువాత తమకు ఆర్థిక స్వాతంత్ర్యం ఉండాలని కోరుకున్నారు. 18 శాతం మంది భర్తలతో పాటు అన్ని బాధ్యతలు పంచుకునేందుకు ఇష్టపడుతుండగా, 14 శాతం మంది మాత్రం తల్లిదండ్రుల్లానే భర్తను కూడా భావిస్తున్నట్టు షాదీ.కామ్ వెల్లడించింది. దీని ప్రకారం భారతీయత మన నరనరాల్లో ఇంకిపోయిందని, ఆందోళన చెందేంత పరిణామలు భారత సమాజంలో చోటుచేసుకోలేదని ఈ వెబ్ సైట్ అభిప్రాయపడింది.

  • Loading...

More Telugu News