: సినిమా థియేటర్ల యాజమాన్యాన్ని వదిలేది లేదు: తలసాని
సినిమా థియేటర్ల యజమానులు పన్నులు చెల్లించడం లేదని... వారిని వదిలిపెట్టమని తెలంగాణ వాణిజ్య పన్నుల శాఖ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ హెచ్చరించారు. హైదరాబాదులో వాణిజ్య పన్నుల సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాజధాని పరిధిలోని వస్త్ర, కార్పొరేట్, జ్యుయలరీ షాపుల యజమానులు పన్నులు చెల్లించడం లేదని అన్నారు. వస్త్ర వ్యాపారులపై వ్యాట్ పన్ను విధిస్తామని ఆయన చెప్పారు. పన్నులు కట్టని వ్యాపారుల వివరాలు అందజేసే వారికి పారితోషికం అందజేస్తామని ఆయన తెలిపారు. ప్రభుత్వానికి పన్నులు చెల్లించి తెలంగాణ అభివృద్ధిలో భాగం కావాలని ఆయన కోరారు.