: భారత్ మినహా మిగతా దేశాల్లో 'నిర్భయ' డాక్యుమెంటరీ ప్రసారం


'ఇండియాస్ డాటర్' పేరుతో నిర్భయ ఘటనపై బ్రిటన్ దర్శకురాలు లెస్లీ ఉద్విన్ రూపొందించిన డాక్యమెంటరీనీ ఎట్టకేలకు బ్రిటీస్ బ్రాడ్ కాస్టింగ్ కార్పోరేషన్ (బీబీసీ) నిన్న (బుధవారం) రాత్రి ప్రసారం చేసింది. నిబంధనలు ఉల్లంఘించిన కారణంగా ఈ డాక్యుమెంటరీపై భారత్ లో నిషేధం విధించడంతో యూకె సహా ఇతర దేశాల్లో ప్రసారం అయింది. ఇదిలాఉంటే డాక్యమెంటరీపై నిర్భయ తల్లి స్పందిస్తూ, డాక్యమెంటరీ నిర్మించడం, నిందితుడి ఇంటర్వ్యూ చేయడం వంటి విషయాలు తమ కుమార్తెకు న్యాయం చేయలేవని అన్నారు. తమ కూతురు చనిపోయిందని, ఏదీ ఆమెను వెనక్కి తీసుకురాలేవన్నారు. తాము కేవలం న్యాయం మాత్రమే కోరుతున్నామని చెప్పారు. ఆ డాక్యుమెంటరీ తమకు ముఖ్యం కాదని చెబుతున్నారు.

  • Loading...

More Telugu News