: అతిగా అల్లరి చేస్తున్న అభిమానులను శాంతించాలని కోరిన పవన్
తమ పవర్ స్టార్ ను దగ్గర నుంచి చూడాలన్న అత్యుత్సాహం ఉండవల్లి సభను గందరగోళ పరిచింది. మైకులు సరిగ్గా పనిచేయక పోవడంతో, పవన్ ఏమి మాట్లాడుతున్నారో తెలియని పరిస్థితి నెలకొంది. వేదిక దగ్గరకు దూసుకెళ్లిన అభిమానులు, మీడియా ప్రతినిధుల మధ్య కొంత తోపులాట జరిగింది. పోలీసుల సంఖ్య తక్కువగా ఉండటంతో వీరిని అదుపు చేయడం సమస్యగా మారింది. దీంతో అతిగా అల్లరి చేస్తున్న అభిమానులపై పవన్ అసహనం వ్యక్తం చేశారు. ఇలాగే అల్లరి చేయాలనుకుంటే వెనక్కి వెళ్ళిపోవాలని ఆయన సూచించారు.