: వాళ్లు రెచ్చిపోతే ఏమీ చేయలేం... ఏ తరహా ప్లాన్ లేకుండా వెళ్లిపోవడమే ఉత్తమం!: ధోనీ
వరల్డ్ కప్ లో మారుమోగుతున్న రికార్డు ఇన్నింగ్స్ లపై టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ దృష్టి సారించినట్లున్నాడు. వెస్టిండీస్ స్టార్ ప్లేయర్ క్రిస్ గేల్, దక్షిణాఫ్రికా కెప్టెన్ ఏబీ డివిలియర్స్ వీరవిహారంపై అతడు కాస్తంత ఆసక్తి, ఆశ్చర్యం, భయం వ్యక్తం చేసినా... టీమిండియాకు వచ్చిన ఇబ్బందేమీ లేదని తేల్చేశాడు. ‘‘గేల్, డివిలియర్స్ లాంటి వాళ్లు రెచ్చిపోతే, వాళ్లను కట్టడి చేయడం సాధ్యం కాదు. అయినా ఒక్కడే సిక్సుల మీద సిక్సులు కొడితే ఏం చేసేది? ఫీల్డింగ్ ఎక్కడ పెట్టేది? షార్ట్ పిచ్ బంతులనూ వదలకపోతే ఏం చేస్తాం? వారిని ఆపేందుకు ప్రత్యేక ప్రణాళిక అంటూ ఉండదు. ఎలాంటి ప్రణాళిక లేకుండా బరిలోకి దిగితేనే సత్ఫలితాలు వచ్చే అవకాశాలున్నాయి. అయితే ఫీల్డింగ్ లో ఏ చిన్న అవకాశాన్నీ చేజార్చకపోతే వారిని నిలువరించడం కష్టమేమీ కాదు’’ అని ధోనీ వ్యాఖ్యానించాడు.