: హోలీ రంగులు పూసుకున్నారు... లోక్ సభ నుంచి బయటకొచ్చేశారు!
దేశ రాజధాని ఢిల్లీలో నిన్న హోలీ వేడుకలు బాగానే జరిగాయి. నగర ప్రజలతో పాటు పలువురు ప్రముఖులు కూడా హోలీ వేడుకల్లో మునిగితేలారు. ఇలా హోలీ వేడుకల్లో మునిగితేలి, ముఖాలపై రంగులతోనే లోక్ సభకు వెళ్లిన ఇద్దరు బీజేపీ ఎంపీలు మాత్రం సమావేశాల నుంచి బయటకు వచ్చేయాల్సి వచ్చింది. వివరాల్లోకెళితే, నిన్నటి సమావేశాలకు బీజేపీ ఎంపీ జగదాంబికా పాల్, మరో సభ్యుడు ముఖాలపై హోలీ రంగులతో హాజరయ్యారు. వారి వైపు స్పీకర్ కాస్త అసహనంగా చూశారు. దీనిని గమనించిన బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్, జగదాంబికా పాల్ ను బయటకెళ్లమని సూచించారు. దీంతో పాల్ తో పాటు మరో ఎంపీ కూడా పార్లమెంటు హాలు నుంచి బయటకొచ్చేశారు.