: శ్రీకాకుళంలో జపాన్ బృందం...4,000 మెగావాట్ల అల్ట్రా మెగా సూపర్ క్రిటికల్ ధర్మల్ పవర్ ప్రాజెక్టు
శ్రీకాకుళం జిల్లా పొలాకి మండలంలోని ఓదిపాడు, జీడివలస, గౌరంపేట, రాజరాంపురం, జోగంపేట, కొవిరిపేట గ్రామాల్లో జపాన్ సుమిటోమో, కుషిబా, హిటాచి సంస్థలకు చెందిన ప్రతినిధులు, ఏపీ జెన్ కో బృందంతో కలిసి పర్యటించారు. నాలుగు వేల మెగావాట్ల అల్ట్రా మెగా సూపర్ క్రిటికల్ ధర్మల్ పవర్ ప్రాజెక్టు ఏర్పాటు చేసే విషయంపై పరిశీలించారు. ఇక్కడ పోర్టు ఏర్పాటుపై అవకాశాలను కూడా పరిశీలించారు. పవర్ ప్రజెక్టు ఏర్పాటుకు వెయ్యి ఎకరాల పోరంబోకు భూమి అందుబాటులో ఉండగా, మరో 1500 ఎకరాల భూమి రైతుల నుంచి సేకరించాల్సి ఉంటుందని జెన్ కో ఇంజనీర్లు తెలిపారు.