: బీజేపీలో చేరిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ కంతేటి సత్యనారాయణరాజు
ఏపీ కాంగ్రెస్ కు మరో ఎదురుదెబ్బ తగిలింది. నలభై ఏళ్ల పాటు ఆ పార్టీని అంటిపెట్టుకుని ఉన్న ఎమ్మెల్సీ కంతేటి సత్యనారాయణరాజు కాంగ్రెస్ నుంచి వైదొలగారు. తాజాగా ఢిల్లీలో అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరారు. గతంలో శాసనమండలి సభ్యుడు కావడానికి తీవ్ర కృషి చేసిన ఆయనకు చివరికి పార్టీ అధిష్ఠానం గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీని కట్టబెట్టింది. అయితే ఏపీ బీజేపీలో ఆయనకు ఎలాంటి పదవి దక్కుతుందనే విషయం తెలియాల్సి ఉంది. ఇటీవల ఏపీలో తీవ్ర విమర్శలెదుర్కొంటున్న బీజేపీలో కంతేటి చేరడం గమనార్హం.