: ఫీజు రీయింబర్స్ మెంట్ నిధులు విడుదల చేయకుంటే ఆమరణదీక్ష చేస్తా: కిషన్ రెడ్డి


ఫీజు రీయింబర్స్ మెంట్ నిధులు వెంటనే విడుదల చేయాలని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, నిధులు విడుదల చేయని పక్షంలో తాను ఆమరణదీక్షకు దిగుతానని హెచ్చరించారు. విద్యార్థుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఇష్టానుసారం వ్యవహరిస్తోందని అన్నారు. జీహెచ్ఎంసీలో ఇష్టానుసారం ఆస్తిపన్ను వసూలు చేస్తున్నారని ఆరోపించారు. దీనిపై రేపు ఇందిరాపార్కు వద్ద దీక్ష చేపడతామని ఆయన పేర్కొన్నారు. ప్రజాసంక్షేమాన్ని కేసీఆర్ విస్మరిస్తున్నారన్న కిషన్ రెడ్డి, ప్రజలే శాశ్వతమని, పదవులు శాశ్వతం కాదన్న విషయాన్ని ఆయన గుర్తించాలని సూచించారు.

  • Loading...

More Telugu News