: భయపడుతూనే... వ్యాక్సిన్ వేయించుకున్న త్రిష
దేశ వ్యాప్తంగా హడలెత్తిస్తోన్న స్వైన్ ఫ్లూ ధాటికి సామాన్యుడి నుంచి సెలబ్రిటీల వరకు అందరూ హడలిపోతున్నారు. రీసెంట్ గా సినీ నటుడు అనిల్ కపూర్ కుమార్తె, బాలీవుడ్ అందాల భామ సోనమ్ కపూర్ స్వైన్ ఫ్లూ బారిన పడ్డ సంగతి తెలిసిందే. దీంతో ఆమెను షూటింగ్ స్పాట్ నుంచి ఏకంగా ముంబైకి తరలించి చికిత్స చేయించారు. ఈ వార్త తెలుసుకున్న నటి త్రిష తీవ్ర భయాందోళనకు గురైందట. మామూలుగా అయితే, తనకు కనీసం సూది వేయించుకోవాలన్నా భయమని, కానీ, స్వైన్ ఫ్లూ భయంతో వ్యాక్సిన్ వేయించుకున్నానని తెలిపింది. అంతేకాదు, ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకోవాలని కూడా సలహా ఇస్తోంది. తాను స్వైన్ ఫ్లూ వ్యాక్సిన్ వేయించుకున్న ఫొటోను ట్విట్టర్, ఫేస్ బుక్ లలో పోస్ట్ చేసింది.