: అనంతలో బాంబు పేలుడు కలకలం... తాడిపత్రిలో 12 నాటు బాంబులు స్వాధీనం
అనంతపురం జిల్లా తాడిపత్రి మండల పరిధిలోని కోమలిలో కొద్దిసేపటి క్రితం నాటు బాంబు పేలింది. గ్రామంలోని ఓ స్థలంలో జేసీబీతో తవ్వుతుండగా, ఉన్నట్టుండి అక్కడ బాంబు పేలుడు సంభవించింది. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు ఇంకా బాంబులున్నాయేమోనన్న అనుమానంతో ఆ ప్రాంతంలో సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో 12 నాటు బాంబులు లభ్యమయ్యాయి. దీంతో పేలుడు చోటుచేసుకున్న స్థల యజమాని ఆదినారాయణరెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. బాంబు పేలుడులో ఏ ఒక్కరూ గాయపడలేదు.