: కోర్టు నిర్దోషిగా ప్రకటిస్తే శ్రీశాంత్ మళ్లీ రావొచ్చు: టీసీ మాథ్యూస్
ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్ స్కాంలో ఆరోపణలతో మాజీ క్రికెటర్ శ్రీశాంత్ పై నిషేధం విధించిన సంగతి విదితమే. తాజాగా అతని విషయంపై బీసీసీఐ ఉపాధ్యక్షుడు, ఐపీఎల్ పాలక మండలి సభ్యుడు టీసీ మాథ్యూస్ స్పందించారు. ఈ స్కాం కేసు నుంచి శ్రీ బయటపడితే కేరళ క్రికెట్ సంఘం తరపున, బీసీసీఐ ఉపాధ్యక్షుడిగా తాను మద్దతిస్తానన్నారు. ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి న్యాయస్థానంలో విచారణ జరుగుతోందని, నిర్దోషిగా తేలితే మళ్లీ క్రికెట్ ఆడే అవకాశం ఉందని ఆశిస్తున్నానని చెప్పారు. అయితే కేసు ఏమవుతుందనే విషయం గురించి తాను మాట్లాడబోనన్నారు. శ్రీశాంత్ తో తాను నిన్ననే మాట్లాడానని ఓ ప్రెస్ మీట్ లో చెప్పారు.