: హైదరాబాదు మాజీ మేయర్ లక్ష్మీనారాయణ కన్నుమూత
హైదరాబాదు మాజీ మేయర్ లక్ష్మీనారాయణ ముదిరాజ్ (86) కన్నుమూశారు. హైదర్ గూడ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన మరణించారు. నగర మేయర్ గా, మహారాజ్ గంజ్ ఎమ్మెల్యేగా, టింబర్ మర్చెంట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కూడా గతంలో నారాయణ పని చేశారు. ప్రధానంగా నగరంలోని గన్ పార్క్ వద్ద అమరవీరుల స్తూపాన్ని ఏర్పాటు చేసింది ఆయనే. లక్ష్మీనారాయణ మరణం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.