: 1100 కిలోమీటర్ల పాదయాత్రకు సిద్ధమైన అన్నా హజారే
ప్రస్తుతం ప్రతిపాదనలో వున్న భూసేకరణ బిల్లులో రైతు వ్యతిరేక నిబంధనలు తొలగించాలని డిమాండ్ చేస్తూ, వార్ధా నుంచి ఢిల్లీ వరకూ 1100 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేపట్టనున్నట్లు సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారే తెలిపారు. వార్ధాలో మహాత్మాగాంధీ ప్రారంభించిన సేవాగ్రాం నుంచి ఢిల్లీలోని రాంలీలా మైదానం వరకు మూడు నెలలపాటు పాదయాత్ర సాగుతుందని చెప్పారు. యాత్ర ఎప్పుడు మొదలు పెట్టేదీ 9వ తేదీన నిర్ణయిస్తామని తెలిపారు. కాగా, భూసేకరణ బిల్లును వ్యతిరేకిస్తూ, ఇటీవల ఆయన రాంలీలా మైదానంలో రెండురోజుల దీక్ష చేసిన సంగతి తెలిసిందే.