: టీడీపీ నేత ఇంటిపై బాంబుల దాడి... తృటిలో ప్రాణాలతో బయటపడ్డ నేత


నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని రూపుదిద్దుకుంటున్న గుంటూరు జిల్లాలో రాత్రి కలకలం రేగింది. టీడీపీ నేత ఇంటిపై ప్రత్యర్థులు బాంబులతో దాడి చేశారు. అయితే ఆ బాంబులు ఆ నేత ఇంటి వరండాలోనే పడ్డాయి. దీంతో ఆ నేత తృటితో ప్రాణాలతో బయటపడ్డారు. నిన్న అర్ధరాత్రి దాటిన తర్వాత గుంటూరు జిల్లా నాగిరెడ్డిపాలెంలో ఈ ఘటన చోటుచేసుకుంది. టీడీపీ నేత సీతారాంరెడ్డి ఇంటిపై ప్రత్యర్ధులు బాంబులు విసిరారు. అయితే, ఆయన బెడ్ రూంలో నిద్రిస్తుండడంతో ప్రాణాపాయం నుంచి తప్పించుకోగలిగారు. సీతారాంరెడ్డి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు, బాంబులు విసిరిన వ్యక్తుల కోసం గాలింపు చేపట్టారు.

  • Loading...

More Telugu News