: సూపర్ మార్కెట్ విస్తరించాలని తవ్వితే...వందలాది అస్థిపంజరాలు బయటపడ్డాయి!


ఫ్రాన్స్ రాజధాని పారిస్ లోని ఒక సూపర్ మార్కెట్ ను విస్తరించాలని తవ్వకాలు జరుపుతుండగా వందలాది అస్థిపంజరాలు బయటపడి అక్కడి వారిని ఆందోళనకు గురి చేశాయి. దీంతో పురాతత్వ శాస్త్రవేత్తలు పరిశోధనలు ప్రారంభించి వాస్తవాలు వెలికి తీశారు. 13వ శతాబ్ధంలో అక్కడ ఒక ఆసుపత్రి ఉండేదట. ఆ రోజుల్లో అంటువ్యాధులు ప్రబలి ఊళ్లకు ఊళ్లు నాశనమైపోయేవట. అలాగే ఓ అంటువ్యాధితో ప్రాణాలు కోల్పోయిన 200 మృతదేహాలను ఆసుపత్రి సమీపంలోని శ్మశానంలో ఖననం చేశారట. కాల క్రమేణ ఆసుపత్రి శిథిలమైపోవడంతో నగరం విస్తృతమై సూపర్ బజార్ వెలిసింది. ఇన్నేళ్లకు అక్కడ తవ్వకాలు జరపడంతో అస్థిపంజరాలు వెలుగులోకి వచ్చి, ఆందోళనకు గురి చేశాయి. విషయం తెలుసుకున్న షాపింగ్ మాల్ యాజమాన్యం ఊపిరి పీల్చుకుంది.

  • Loading...

More Telugu News