: మేము దేనికైనా సిద్ధమే...అమెరికాకు ఉత్తర కొరియా హెచ్చరిక


అమెరికా అణుదాడికి పాల్పడితే తిప్పికొట్టే సామర్థ్యం ఉందని ఉత్తర కొరియా విదేశాంగ శాఖ మంత్రి రి సూ యోంగ్ తెలిపారు. జెనీవాలో ఐక్యరాజ్యసమితి నిర్వహించిన నిరాయుధీకరణ సమావేశంలో ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. అణు ముప్పును అడ్డుకోగల సామర్ధ్యం కొరియా సొంతమని అన్నారు. దక్షిణ కొరియా, యూఎస్ఏలు సంయుక్తంగా సైనిక విన్యాసాలు జరపడం అంటే రెచ్చగొట్టడమేనని ఆయన స్పష్టం చేశారు. ఇది యుద్ధానికి దారితీసే అవకాశముందని ఆయన పేర్కొన్నారు. కాగా, ఉత్తర కొరియా రెండు స్వల్ప శ్రేణి క్షిపణులను విజయంతంగా పరీక్షించడంపై జపాన్ ఆగ్రహం వ్యక్తం చేసింది.

  • Loading...

More Telugu News