: రైతుల ఆత్మహత్యలు 26 శాతం పెరిగాయి: కేంద్రం
2014లో రైతుల ఆత్మహత్యలు 26 శాతం పెరిగాయని కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో వెల్లడించింది. ప్రతిపక్షాలు అడిగిన ప్రశ్నకు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి మోహన్ భాయ్ కల్యాణ్ జీ భాయ్ కుందరియా లిఖితపూర్వక సమాధానమిచ్చారు. దాని ప్రకారం 2014లో దేశ వ్యాప్తంగా 1109 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. రైతులు అత్యధికంగా ఆత్మహత్యలకు పాల్పడిన రాష్ట్రాల్లో 986 మంది రైతుల మృతితో మహారాష్ట్ర అగ్రస్థానంలో ఉండగా, 84 మంది రైతుల ఆత్మహత్యలతో తెలంగాణ రెండవ స్థానంలో ఉంది. 29 మంది అన్నదాతల ఆత్మహత్యలతో జార్ఖాండ్ మూడవ స్థానంలో నిలిచిందని ఆయన స్పష్టం చేశారు.