: 29.3 కోట్ల మంది భార్యలుంటే... 28.7 కోట్ల మంది భర్తలే ఉన్నారు


దేశంలో పెళ్లైన స్త్రీ పురుషుల మధ్య భారీ వ్యత్యాసం కనిపిస్తోంది. తాజా గణాంకాల ప్రకారం దేశ జనాభా 120 కోట్లు కాగా, అందులో 58 కోట్ల మందికి వివాహాలు జరిగాయని తెలుస్తోంది. వీరిలో 29.3 కోట్ల మంది వివాహిత మహిళలు ఉండగా, 28.7 కోట్ల మంది వివాహిత పురుషులు ఉన్నారు. వీరిలో భర్తలు మరణించినవారు, బహుభార్యత్వం, భార్యలను స్వదేశంలో విడిచి ఉద్యోగం కోసం వెళ్లిన వారి వివరాలు లేవు. 15 ఏళ్ల కంటే తక్కువ వయసున్న 18 లక్షల మంది బాలికలకు వివాహం జరిగినట్టు తెలుస్తోంది. ఈ గణాంకాల ప్రకారం కేరళలో పెళ్లయిన ప్రతి ఒక్క పురుషుడికి 1.13 మంది వివాహిత మహిళలు ఉన్నట్టు వెల్లడైంది. తరువాతి స్థానాల్లో ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, బీహార్ లు ఉన్నాయి. మహారాష్ట్ర, గుజరాత్, ఢిల్లీ వంటి చోట్ల వలస కార్మికుల తాకిడి ఎక్కువగా ఉండడంతో మహిళల సంఖ్య కంటే పురుషుల సంఖ్యే అధికంగా ఉంది.

  • Loading...

More Telugu News