: ఇప్పుడిలా మాట్లాడుతున్నాను కానీ...నేను ఇంట్రావర్ట్ ని!: ధోనీ
మిస్టర్ కూల్ గా, మంచి మాటకారిగా పేరొందిన టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఇంట్రావర్ట్ (కలివిడితనంలేని) అట, ఈ విషయాన్ని ధోనీయే వెల్లడించాడు. ప్రపంచ కప్ సందర్భంగా స్టార్ టీవీ ధోనీతో చిన్నపిల్లల ఇంటరాక్షన్ కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఇందులో ఓ తుంటరి పిల్ల, 'ధోనీ నువ్వు ఇంట్రావర్టా? ఎక్సట్రావర్టా?' అని అడిగింది. ఈ ప్రశ్నకు ఒకింత గట్టిగా నవ్విన ధోనీ, నువ్వేమనుకుంటున్నావని అడిగాడు. బాలిక మౌనం దాల్చడంతో తాను ఇంట్రావర్టనని, అయితే పరిస్థితుల కారణంగా ఎక్సట్రావర్ట్ లా ఉండాల్సి వస్తుందని అన్నాడు. తానే మాట్లాడాలి కనుక మాట్లాడుతున్నానని, సాధారణంగా ఎంతో పరిచయం ఉంటే కానీ మాట్లాడలేనని, పరిచయం, స్నేహం కుదిరిన తరువాత స్వేచ్ఛగా ఉంటానని ధోనీ చెప్పాడు.