: సౌతాఫ్రికా రికార్డుల విజయం


పసికూనపై ఎలా ఆడితే రికార్డుల మోత మోగుతుందో సౌతాఫ్రికాకు తెలిసినంతగా ఇంకేజట్టుకూ తెలియదేమో. వరల్డ్ కప్ లో ఐర్లాండ్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో రికార్డుల మోత మోగించింది. తన రికార్డు తానే బద్దలు కొట్టడం విశేషం. అత్యధిక స్కోరు సాధించిన రెండవ జట్టుగా గతవారం విండీస్ పై తాను నెలకొల్పిన ప్రపంచ రికార్డును తానే చెరిపేసుకుని, మరోసారి అదే రికార్డు సాధించింది. దానితో పాటు రెండవ వికెట్ భాగస్వామ్యానికి అత్యధిక పరుగులు (247) జత చేసిన ఆటగాళ్లుగా హషీమ్ ఆమ్లా (159) డుప్లెసిస్ (109) నిలిచారు. ఈ క్రమంలో ఆమ్లా అత్యధిక వ్యక్తిగత పరుగులను నమోదు చేయడం విశేషం. తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా జట్టు నాలుగు వికెట్ల నష్టానికి 411 పరుగులు సాధించింది. ప్రపంచ రికార్డు 413 పరుగులు సాధించిన భారత జట్టుకు కేవలం రెండు పరుగుల దూరంలో నిలిచిపోయింది. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన ఐర్లాండ్ జట్టు పోరాటపటిమ చూపినప్పటికీ కేవలం 210 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో ప్రోటీస్ రికార్డు విజయం సాధించింది.

  • Loading...

More Telugu News