: జగన్ యాత్రతో చంద్రబాబు మైండ్ బ్లాంక్ అయింది: తమ్మినేని


తమ అధినేత జగన్ చేపట్టిన రైతు భరోసా యాత్రతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మైండ్ బ్లాంక్ అయిందని వైకాపా నేత తమ్మినేని సీతారాం అన్నారు. ప్రభుత్వం గుండెల్లో దడ మొదలైందని... అందువల్లే చంద్రబాబు చాలా అసహనంగా వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. రాజధాని నిర్మాణానికి ఇన్ని వేల ఎకరాల భూమి ఎందుకని తమ్మినేని ప్రశ్నించారు. రాష్ట్ర రాజధాని నిర్మాణానికి తాము వ్యతిరేకం కాదని... కాకపోతే, భూసేకరణ కోసం ప్రభుత్వం అనుసరిస్తున్న విధానమే సరిగా లేదని మండిపడ్డారు. రాజధాని కోసం తమ భూములను ఇవ్వమని రైతులు స్పష్టంగా చెబుతున్నప్పటికీ, ప్రభుత్వం బలవంతంగా లాక్కుంటోందని విమర్శించారు.

  • Loading...

More Telugu News