: రిజర్వేషన్లు కావాలంటే పాకిస్థాన్ వెళ్లు... ఒవైసీపై విరుచుకుపడ్డ శివసేన
ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించాలన్న ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీపై శివసేన ఘాటుగా స్పందించింది. గత ఆదివారం మహారాష్ట్రలోని నాగ్ పూర్ లో ఓ బహిరంగ సభలో ప్రసంగించిన అసదుద్దీన్ ఒవైసీ... విద్యాసంస్థలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించాలంటూ డిమాండ్ చేశారు. దీనిపై మండిపడ్డ శివసేన, తన అధికార పత్రిక సామ్నాలో సంచలన కథనం ప్రచురించింది. మహారాష్ట్రలో ముస్లింలకు తీవ్ర అన్యాయం జరిగిందంటూ తప్పుడు వ్యాఖ్యలు చేసిన ఒవైసీకి... ముస్లిం తీవ్రవాదుల వల్ల ఎంతమంది హిందువులు నష్టపోయారో తెలుసా? అని నిలదీసింది. ఇలాంటి విద్వేషపూరిత వ్యాఖ్యలు చేసిన ఒవైసీపై ఫడ్నవిస్ ప్రభుత్వం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేసింది. భారతదేశాన్ని తమ మాతృభూమిగా ముస్లింలందరూ గౌరవించాలని సూచించింది. ముస్లింలకు రిజర్వేషన్లు కావాలంటే, పాకిస్థాన్ కు వెళ్లి ప్రయత్నించుకోవాలంటూ ఒవైసీపై శివసేన మండిపడింది.