: కొండచరియలు విరిగిపడి సైనికుల మృతి
విధినిర్వహణలో ఉన్న ఆ సైనికులను మృత్యువు కొండ చరియల రూపంలో కబళించింది. ఈ ఘటన ఉత్తరాఖండ్ లోని పితోర్ గడ్ జిల్లా సిలక్ సరిహద్దు ప్రాంతంలో జరిగింది. భద్రతా దళాలు ఉన్న ఒక చెక్ పోస్ట్ పై భారీ కొండ చరియలు విరిగిపడ్డాయి. దీంతో ఇద్దరు జవాన్లు అక్కడికక్కడే చనిపోయారు. మరో సైనికుడి ఆచూకీ తెలియడంలేదని అధికారులు తెలిపారు. మొత్తం ఎనిమిది మంది ఈ చెక్ పోస్ట్ వద్ద విధుల్లో ఉన్నారని, వీరిలో ఐదుగురు ప్రాణాలతో బయటపడ్డారని తెలిపారు. కాగా, గత రెండు రోజులుగా కురుస్తున్న మంచు వర్షాల కారణంగానే చరియలు విరిగిపడ్డట్టు తెలుస్తోంది.