: టీడీపీ నేతల్లారా ఎవరిని మభ్యపెడుతున్నారు?: మైసూరారెడ్డి


కేంద్ర బడ్జెట్ లో అన్యాయం జరిగిందంటూ ఆందోళనలు చేస్తున్న టీడీపీ కేంద్రం నుంచి బయటకు రావాలని వైఎస్సార్సీపీ నేత మైసూరారెడ్డి డిమాండ్ చేశారు. కడప జిల్లాలో నిరవధిక నిరాహారదీక్ష చేపట్టిన రవీంద్రనాథ్ రెడ్డిని పరామర్శించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బడ్జెట్ లో అన్యాయం జరిగిన మాట వాస్తవమేనని, అయితే, దానిలో టీడీపీ భాగస్వామ్యం కూడా ఉందని అన్నారు. టీడీపీ భాగస్వామ్యం లేదంటే తక్షణం కేంద్రంలోని పదవులను త్యజించి బయటకు రావాలని డిమాండ్ చేశారు. ఆర్డినెన్స్ జారీ చేసి ముంపు మండలాలను ఏపీలో కలిపిన బీజేపీ జాతీయ ప్రాజెక్టు పోలవరానికి వంద కోట్లు ఎలా సరిపోతాయని కేటాయించిందని ఆయన ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టును నీరుగార్చి, పట్టిసీమ ప్రాజెక్టును పూర్తి చేయాలని బీజేపీ, టీడీపీలు కుట్రపన్నాయని ఆయన మండిపడ్డారు. రాయలసీమకు నీరు తరలించుకుపోతున్నారని మంత్రి దేవినేని ఉమ గతంలో ఆందోళన చేశారని, ఇప్పుడు గండికోటకు జూలైలోగా ఎలా నీరిస్తామని చెప్పగలుగుతున్నారో వివరించాలని ఆయన డిమాండ్ చేశారు. సర్కారుకు చిత్తశుద్ధి ఉంటే శ్రీశైలం నీటిని కిందికి ఎందుకు వదిలారో చెప్పాలని అడిగారు.

  • Loading...

More Telugu News