: కేరళ వైపు దూసుకొచ్చిన 'అగ్ని గోళం'... ఉల్క కావచ్చంటున్న నిపుణులు


కేరళ మీదకు ఆకాశం నుంచి 'అగ్నిగోళం' దూసుకు వచ్చింది. కేరళలోని పలు జిల్లాల్లో ఈ దృశ్యాన్ని చూసిన ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. ఈ ఫైర్ బాల్ భారీ పరిమాణంలో వున్న ఉల్క కావచ్చని శాస్త్రవేత్తలు తెలిపారు. ఇది నేలను తాకినట్టుగా భావిస్తున్న ఎర్నాకులం జిల్లా కరిమల్లూరు సమీప ప్రాంతంలో శాంపిల్స్ సేకరించిన విపత్తు విభాగం అధికారులు ప్రయోగాలు జరిపారు. తమ ప్రాథమిక అంచనాల ప్రకారం ఇది ఉల్క అని వివరించారు. ఇనుము, నికెల్ తదితర లోహాల మిశ్రమంగా గుర్తించిన ఈ శాంపిల్స్ కు గురుత్వాకర్షణ శక్తి ఉందని, ఉల్కా భాగాలు చూసేందుకు చిన్నగా కనిపిస్తున్నా, ఉండాల్సిన బరువు కంటే ఎక్కువ బరువు ఉన్నాయని తెలిపారు. పూర్తి పరీక్షల కోసం జియోలజికల్ సర్వే అఫ్ ఇండియాకు వీటిని పంపనున్నట్టు తెలిపారు. కేరళలోని త్రిస్సూర్, ఎర్నాకులం, పాలక్కాడ్, మలప్పురం, కోజికోడ్ తదితర జిల్లాల్లో ఈ గోళం కనిపించింది.

  • Loading...

More Telugu News