: తెలంగాణ పీసీసీ చీఫ్ గా ఉత్తమ్ కుమార్ నియామకానికి ఏఐసీసీ ఉత్తర్వులు


తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డిని నియమిస్తూ ఏఐసీసీ ఈరోజు ఉత్తర్వులు ఇచ్చింది. మల్లు భట్టివిక్రమార్కను కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఉత్తర్వుల్లో పేర్కొంది. దాంతోపాటు, మహారాష్ట్ర, గుజరాత్, జమ్ముూకాశ్మీర్, ఢిల్లీలకు కూడా కాంగ్రెస్ కొత్త పీసీసీ అధ్యక్షులను నియమించింది. ఈ క్రమంలో ఢిల్లీకి అజయ్ మాకెన్, గుజరాత్ కు భరత్ సింగ్ సోలంకి, మహారాష్ట్రకు మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్, జమ్మూకాశ్మీర్ కు మాజీ మంత్రి గులామ్ అహ్మద్ లను పీసీసీ అధ్యక్షులుగా నియమించినట్టు ఉత్తర్వుల్లో తెలిపింది.

  • Loading...

More Telugu News