: గూగుల్ శోధనలో తొలి స్థానంలో పాకిస్థాన్ క్రికెట్ జట్టు


వరల్డ్ కప్ నేపథ్యంలో పాకిస్థాన్ క్రికెట్ టీమ్ వివరాల కోసం ఆన్ లైన్ లో అత్యధికులు వెతికారని సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ తెలిపింది. ఈ క్రమంలో నిర్వహించిన తాజా ఆన్ లైన్ సర్వేలో పాక్ జట్టు తొలిస్థానంలో నిలిచినట్టు వెల్లడించింది. టోర్నీలో మెరుగైన ప్రదర్శన కనబర్చకపోయినప్పటికీ ఈ జట్టుకు ఇంతటి స్పందన రావడం విశేషం. "టీమిండియా, వెస్టిండీస్ పై రెండుసార్లు ఘోరంగా ఓడిపోయినప్పటికీ పాకిస్థాన్ జట్టుకోసం ఆన్ లైన్ లో శోధన ఇంకా కొనసాగుతోంది. ఈ క్రమంలో ఈ టోర్నమెంట్ లో టాప్ సెర్చ్డ్ టీమ్ గా నిలిచింది" అని గూగుల్ సర్వే తెలిపింది. కాగా పాక్ తరువాతి స్థానాల్లో భారత్, వెస్టిండీస్, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా జట్లు నిలిచాయి. క్రికెట్ లో కేవలం పెద్ద జట్ల గురించే కాకుండా ఆఫ్ఘనిస్ధాన్, బంగ్లాదేశ్, ఐర్లాండ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వంటి చిన్నజట్ల గురించి కూడా క్రికెట్ అభిమానులు శోధించారట. అంతేగాక, ఆటగాళ్ల శారీరక లక్షణాల గురించి కూడా అభిమానులు వెతుకులాడారట. ప్రధానంగా పాక్ పేసర్ మహ్మద్ ఇర్ఫాన్ కచ్చితమైన ఎత్తు గురించి భారత అభిమానులు వెతికితే, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు ఇంగ్లాండ్ ఆటగాడు జేమ్స్ టేలర్ హైట్ గురించి శోధించారని గూగుల్ తెలిపింది. వరల్డ్ కప్ కు ముందు భారత వైస్ కెప్టెన్ విరాట్ కోహ్లీ హెయిర్ స్టైల్ గురించి కూడా ఆన్ లైన్లో బాగానే చర్చ జరిగిందట.

  • Loading...

More Telugu News