: ఐపీఎల్ బెట్టింగ్... మెయ్యప్పన్, ఇండియా సిమెంట్స్, రాజ్ కుంద్రాలకు నోటీసులు
బీసీసీఐ మాజీ అధ్యక్షుడు శ్రీనివాసన్ అల్లుడు గురునాథ్ మెయ్యప్పన్, శ్రీనికి చెందిన ఇండియా సిమెంట్స్, రాజస్థాన్ రాయల్స్ సహ యజమాని, నటి శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రాలకు సుప్రీంకోర్టు ప్యానెల్ నోటీసులు పంపింది. ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్ కేసులో దోషులుగా నిర్ధారణ అయిన వారికి విధించాల్సిన శిక్షపై వివరణ ఇవ్వాలంటూ ఆదేశించింది. జనవరిలో ఈ కేసులో తుదితీర్పు వెలువరించిన సుప్రీం కొంతమంది ఓ కమిటీ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బెట్టింగ్ కేసులో దోషులుగా ఉన్నవారికి శిక్షను ప్యానెలే నిర్ణయిస్తుందని అప్పుడే తెలిపింది.