: తెలంగాణ శాసనమండలి నుంచి తెలుగుదేశం మాయం!


శాసనమండలి మొదలైన తరువాత తొలిసారిగా తెలుగుదేశం పార్టీ తరపున ఒక్కరంటే ఒక్క ప్రతినిధి కూడా లేకుండాపోయే పరిస్థితి వచ్చింది. ప్రస్తుతం తెలంగాణ శాసనమండలిలో ఆ పార్టీ తరపున వున్న అరికెల నర్సారెడ్డి పదవీకాలం ఈనెల 31తో ముగియనుంది. అంటే, ఏప్రిల్ ఒకటి నుంచి టీడీపీ నుంచి ప్రాతినిధ్యం వహించే వారే ఉండరు. నిన్నమొన్నటి వరకూ తెలుగుదేశం నుంచి నలుగురు సభ్యులు వుండగా, వారిలో ముగ్గురు టిఆర్‌ఎస్‌ లో చేరారు. ఏప్రిల్ ఒకటి నుంచి కొత్త సభ్యులను ఎంఎల్ఏలు ఎన్నుకోనున్నారు. కనీసం 17 మంది మద్దతుతో ఒక ఎంఎల్సీ విజయం సాధించే పరిస్థితి వుండగా, తెలంగాణాలో 15 మంది శాసనసభ్యులను కలిగివున్న టీడీపీ నుంచి ఇప్పటికే ముగ్గురు టీఆర్ఎస్ లోకి జంప్ చేశారు. దీంతో, కనీసం ఒక్క సభ్యుడినన్నా గెలిపించుకునే పరిస్థితి లేదు. ఇక, రెండు పట్టభద్రుల నియోజక వర్గాలకు ఎన్నికలు జరుగుతున్నప్పటికీ, తెలుగుదేశం పోటీలో లేదు. దీంతో, మరో నెల తరువాత టీడీపీ మండలిలో ఉనికిని కోల్పోనుంది.

  • Loading...

More Telugu News