: యువీతో జతకట్టిన సానియా మీర్జా!
అదేంటీ... యువరాజ్ సింగేమో క్రికెటర్, సానియా మీర్జానేమో టెన్నిస్ క్రీడాకారిణి. మరి వీరిద్దరూ జత కట్టడమేమిటనేగా సందేహం. వీరిద్దరూ జత కట్టింది క్రీడా మైదానంలో కాదులెండి. బుల్లి తెర కార్యక్రమంలో. విషయానికొస్తే... కలర్స్ ఛానెల్ లో ప్రసారమవుతున్న ‘ఫర్హా కీ దావత్’లో వీరిద్దరూ కనిపించనున్నారు. ఆ కార్యక్రమానికి సంబంధించిన షూటింగ్ ఇటీవల జరిగింది. సదరు షూటింగ్ లో సానియా టెన్నిస్ రాకెట్ ను యువీ చేతబట్టగా, యువీ క్రికెట్ బ్యాటును సానియా అందుకుంది.