: తిరుమలలో సైకో హల్ చల్... పట్టుకుని పోలీసులకు అప్పగించిన భక్తులు
పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలలో నేటి తెల్లవారుజామున ఓ సైకో హల్ చల్ చేశాడు. తిరుమలలోని శాంతినగర్ లో వాహనాలపై రాళ్లు రువ్విన సదరు సైకో, భక్తులను భయభ్రాంతులకు గురి చేశాడు. సైకో దాడి నేపథ్యంలో భక్తులు ఉరుకులు పరుగులు పెట్టారు. అయితే భక్తులంతా కూడబలుక్కుని విచక్షణారహితంగా దాడికి పాల్పడుతున్న సైకోను బంధించారు. అనంతరం అతడిని పోలీసులకు అప్పగించారు. సైకో మానసిక పరిస్థితిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.