: జాక్వెలిన్ ఇన్ స్టా గ్రామ్ లో 10 లక్షల మంది అభిమానులు
2006 మిస్ శ్రీలంక, బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ భారీగా అభిమానుల్ని సంపాదించుకుంది. సామాజిక మాధ్యమం ఇన్ స్టా గ్రాంలో ఆమెకు విశేషమైన ఆదరణ లభిస్తోంది. ప్రతిరోజూ ఏదో ఒక విధంగా ఇన్ స్టా గ్రాం ద్వారా అభిమానులను ఆమె అలరిస్తోంది. ఈ నేపథ్యంలో ఆమె ఇన్ స్టా గ్రాం పేజీ 10 లక్షల మంది అభిమానుల్ని సంపాదించుకుంది. ఆమె షేర్ చేసిన ఫోటోలు అభిమానుల్ని అలరిస్తుండడంతో ఆమెను అనుసరించే వారి సంఖ్య అమాంతం పెరిగి పోయింది. భారత్ కు చెందిన పలువురు హీరోయిన్లకు దక్కని గౌరవం ఆమెకు దక్కిందని ఆమె హర్షం వ్యక్తం చేసింది. ఈ ఘనత సాధించినందుకు అభిమానులందరికీ ధన్యవాదాలు తెలిపింది. అభిమానులు ఇలాగే తమ ఆదరణను కొనసాగించాలని ఆమె ఆకాంక్షించింది.