: బాబూ! లాలూచీ పడకండి...బయటికి రండి: కాంగ్రెస్


పదవుల కోసం కేంద్రంతో లాలూచీ పడవద్దని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి కొలనుకొండ శివాజీ సూచించారు. బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏ విధమైన ప్రత్యేక రాయితీలు కల్పించకపోవడంపై విజయవాడలో కాంగ్రెస్ నేతలు ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, టీడీపీ నేతలకు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలన్న చిత్తశుద్ధి ఉంటే పదవులను త్యాగం చేయాలని అన్నారు. కేవలం పదవుల కోసం రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్నా చూస్తూ ఊరుకోవద్దని ఆయన హెచ్చరించారు. ఇప్పటికైనా బీజేపీ అసలు లక్ష్యం గుర్తించాలని అన్నారు. టీడీపీని బీజేపీ గడ్డిపోచకంటే తక్కువగా చూస్తోందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేయాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు. ఢిల్లీ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ రాజధానిని అభివృద్ధి చేస్తానని చెప్పిన మోదీ, తాజా కేటాయింపులతో అలా ఎలా చేస్తారో వివరించాలని ఆయన డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News