: ఆ అధ్యక్షుడికి కాన్వాయ్ లేదు, ఆడంబరాలు లేవు
నిజాయతీ పరుడు, నిరాడంబర అధ్యక్షుడిగా పేరొందిన ఉరూగ్వే అధ్యక్షుడు జోష్ మిజికా పదవీ విరమణకు సిద్ధమవుతున్నారు. మరో రెండు రోజుల్లో ఆయన పదవీ విరమణ చేయనున్నారు. జోష్ మిజికాకు వీడ్కోలు పలికేందుకు దేశ ప్రజలంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. జోష్ మిజికా అంటే దేశ ప్రజలందిరికీ ఎంతో ఇష్టం, ఆయన మాటల నేత కాదని, చేతల నేత అని విశ్వసిస్తారు. ఆయనకు అధ్యక్ష భవనం లేదు. కాన్వాయ్ లేదు. నేతలంతా బుల్లెట్ ప్రూఫ్ కారులో వెళ్తుంటే ఆయన మాత్రం పాత కారులో వెళ్తారు. అంతా అధునాతన భవంతుల్లో నివసిస్తుంటే, ఆయన వ్యవసాయ క్షేత్రంలో ఉన్న చిన్న ఇంట్లోనే ఉంటున్నారు. విమానంలో ప్రయాణించినా ఎకానమీ క్లాస్ లోనే ప్రయాణిస్తారు.