: తాగు, సాగు నీటి సమస్యలు తీర్చాలని నిరాహారదీక్ష చేపట్టిన ఎమ్మెల్యే


తాగు, సాగు నీటి సమస్యలు తీర్చాలని డిమాండ్ చేస్తూ కమాలాపురం ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ నేత పి.రవీంద్రనాథ్‌ రెడ్డి నిరాహార దీక్ష చేపట్టారు. కడప జిల్లా వీరపునాయునిపల్లెలో నిరవధిక నిరాహారదీక్ష చేపట్టిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తమ నియోజకవర్గ ప్రజలు తాగు, సాగు నీటికి పడుతున్న ఇబ్బందులు చూసి దీక్షకు దిగానని అన్నారు. ప్రభుత్వం దిగివచ్చి నియోజకవర్గ ప్రజల సాగు, తాగునీటి సమస్యను పరిష్కరించేంత వరకు దీక్ష కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. కాగా, ఆయన దీక్షకు ఈ పార్టీ నేతలు ఎంపీ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్యేలు అంజాద్ బాషా, రఘురామి రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, ప్రసాద్ రెడ్డి, ఎమ్మెల్సీ నారాయణరెడ్డి, కడప మేయర్ సురేశ్ బాబు సంఘీభావం తెలిపారు.

  • Loading...

More Telugu News