: ఏపీ రాజధానిలో పవన్ కల్యాణ్ పర్యటన రేపే
ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతం తుళ్లూరులో రేపు జనసేన అధినేత పవన్ కల్యాణ్ పర్యటించనున్నారు. కొద్దిసేపటి క్రితం ఏపీ సీఎం చంద్రబాబునాయుడును కలిసిన పవన్ కల్యాణ్, భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. కేంద్ర ప్రభుత్వం రైల్వే, సాధారణ బడ్జెట్ లలో ఆంధ్రులను మోసం చేసిందని, విభజన చట్టంలోని ఏ సమస్యనూ పరిష్కరించేందుకు కేంద్రం చొరవ చూపడం లేదని ఆయన పవన్ కల్యాణ్ తో చెప్పుకుని వాపోయారు. డిమాండ్లు సాధించుకునేందుకు ఢిల్లీకి వెళ్దామని, కలసిరావాలని ఆయన ఆహ్వానించడంతో కల్యాణ్ సమ్మతించారు. అనంతరం రాజధాని ప్రాంతంలో పర్యటించాలని భావించారు. కానీ ఢిల్లీ పర్యటనకు ముందే రైతులతో ముచ్చటించాలని భావించారు. రైతు సమస్యలను నేరుగా వింటే, వాటి గురించి ఢిల్లీలో మాట్లాడవచ్చని ఆయన భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన రేపు తుళ్లూరు ప్రాంతంలో పర్యటించి రైతులతో ముఖాముఖి నిర్వహించనున్నారు.