: పూలు, ముళ్లు అంటూ బడ్జెట్ మధ్యలో జైట్లీ పద్య కవిత... కాంగ్రెస్ కు చురక!
ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ నేడు పార్లమెంటు బడ్జెట్ ప్రవేశపెట్టే సమయంలో ఓ పద్య కవితతో ఆకట్టుకున్నారు. కొన్ని పూలు పూయించామని, కొన్నింటిని పూయించాల్సి ఉందని అన్నారు. అయితే, ఆ తోటలో గతం తాలూకు ముళ్లు అలాగే ఉన్నాయంటూ పరోక్షంగా యూపీఏ హయాంలో తీసుకున్న నిర్ణయాలను ఎత్తిచూపారు. "కుచ్ తో గుల్ ఖిలాయే హై, కుచ్ అభీ ఖిలానే హై, పర్ బాఘ్ మే అబ్ భీ కాంటే కుచ్ పురానే హై" అని పేర్కొనగానే బీజేపీ సభ్యులు బల్లలు చరిచి హర్షం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ సభ్యులు మాత్రం ముఖాలు చిన్నబుచ్చుకున్నారట.